Vijayawada: సీఆర్డీయే కమిషనర్‌ను కలిసిన అమరావతి రైతులు

ABN , First Publish Date - 2023-06-08T14:10:34+05:30 IST

విజయవాడ: సీఆర్డీయే కమిషనర్‌ను అమరావతి రైతు సమన్వయ కమిటీ నేతలు కలిశారు. కౌలు చెల్లింపు ఆలస్యంపై గంటకుపైగా కమిషనర్‌తో చర్చలు జరిపారు.

Vijayawada: సీఆర్డీయే కమిషనర్‌ను కలిసిన అమరావతి రైతులు

విజయవాడ: సీఆర్డీయే (CRDA) కమిషనర్‌ను అమరావతి (Amaravathi) రైతు సమన్వయ కమిటీ నేతలు కలిశారు. కౌలు చెల్లింపు ఆలస్యంపై గంటకుపైగా కమిషనర్‌తో చర్చలు జరిపారు. ఈనెల 25వ తేదీలోగా కౌలు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సీబీసీఐడీ కేసులు (CBCID Cases) త్వరగా తేల్చాలని రైతు నేతలు కోరారు. సెంట్ స్థలాలు డెవలప్‌మెంట్ చేసిన విధంగా రైతుల ప్లాట్‌లు అభివృద్ధి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

అయితే రాజధాని ప్రాంతాల్లో అభివృద్ధికి డబ్బులు లేవని రైతు నేతలతో కమిషనర్ చెప్పారు. వచ్చేనెల 8వ తేదీలోగా రైతుల ప్లాట్లు డెవలప్‌మెంట్ చేయాలని లేకపోతే పోరాటం చేస్తామని రైతు నేతలు చెప్పారు. సేంట్ భూములు తరహాలోనే రైతులకు న్యాయం చేయకపోతే సేంట్ భూములను యధా స్థానానికి తీసుకొస్తామని అన్నారు. రైతుల ఫ్లాట్లలో అక్రమంగా మట్టిని తవ్వుకుపోతున్న అంశాలన్నీ రైతు నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మట్టి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-06-08T14:10:34+05:30 IST