CPM Srinivasarao: గ్యాస్ ధర తగ్గింపు ఎన్నికల డ్రామానే..
ABN , First Publish Date - 2023-08-30T13:28:31+05:30 IST
విజయవాడ: అధికధరలు, నిరుద్యోగం, విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ సీపీఎం సమరభేరి ప్రచారయాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ గ్యాస్ బండ ధర తగ్గింపు ఎన్నికల డ్రామా అని అన్నారు.
విజయవాడ: అధికధరలు, నిరుద్యోగం, విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ సీపీఎం (CPM) సమరభేరి ప్రచారయాత్ర (Samarabheri Campaign) చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలో సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasarao) మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ (PM Modi) గ్యాస్ (Gas) బండ ధర తగ్గింపు ఎన్నికల డ్రామా అని, పెరిగిన ధరలు తగ్గించకుండా మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో సీఎం జగన్ (CM Jagan) జనాలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారన్నారు. సోలార్, విండ్, ఎత్తిపోతల విధానాలతో సబ్సిడీపై ప్రజలకు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. యూనిట్ ఒక రూపాయికే కరెంటు ఇవ్వొచ్చునని అన్నారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని.. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాదాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారా? లేక మద్దతు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. జగన్, చంద్రబాబులు ప్రధాని మోదీకి వత్తాసు పలుకుతున్నారని, ఏపీకి బీజేపీ చేసిన ద్రోహంపై వారు ఎందుకు మాట్లాడటం లేదని శ్రీనివాసరావు నిలదీశారు.