Amaravathi: తాడేపల్లి సీఎం నివాసం దగ్గర భారీ భద్రత
ABN , First Publish Date - 2023-02-11T12:26:21+05:30 IST
అమరావతి: ఏపీఎస్ఎల్ పీఆర్బీ (APSL PRB) అభ్యర్థులు ఛలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు.
అమరావతి: ఏపీఎస్ఎల్ పీఆర్బీ (APSL PRB) అభ్యర్థులు ఛలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ (Police Constable Recruitment)లో అర్హత మార్కుల పర్సంటేజ్ తగ్గించాలని కోరుతూ నిరసన చేపట్టారు. దీంతో తాడేపల్లి సీఎం జగన్ (CM Jagan) నివాసానికి వెళ్లే మార్గంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వచ్చీపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) వచ్చిన నాలుగేళ్ల తర్వాత కానిస్టేబుల్ నోటిఫీకేషన్ ఇచ్చారని దాంతో లక్షలాదిమంది నిరుద్యోగయువత దరఖాస్తు చేసి పరీక్షకు హాజర్యయారని తెలిపారు. ఎగ్జామ్ పేపరు సివిల్స్ స్థాయిలో ఉండడంతో చాలామంది నిరాసచెందారని అన్నారు. కాగా నిరుద్యోగులు చేపట్టిన నిరసనకు అనుమతిలేదంటూ అడుగడుగునా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. దీంతో శనివారం ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందిపడ్డారు.
ఇది కూడా చదవండి..
యువత నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైంది: వెంకయ్య
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో తమకు అన్యాయం జరిగిందని, తమకు అదనపు మార్కులు కలపాలని కోరుతూ పరీక్ష రాసిన అభ్యర్థులు శనివారం ఉదయం ఛలో విజయవాడకు పిలుపు ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గాలన్నీ పూర్తి స్థాయిలో మూసివేశారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనఖీలు చేసి పంపుతున్నారు. ఆధార్, వ్యక్తిగత వివరాలు తెలసుకున్న తర్వాతే వారిని ముందుకు పంపుతున్నారు. అదే సమయంలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు వైపు నుంచి విజయవాడకు వచ్చే హైవే వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా ఏపీ (AP)లో కానిస్టేబుల్ (Constable) పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను (Preliminary Examination Results) స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ టెస్ట్‌కు గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లలో అభ్యర్థులు పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు లక్షల 59 వేల 182 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 95,208 మంది ఉత్తీర్ణులైనట్టు బోర్డు వెల్లడించింది.
అయితే గత నెల 22న పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ కీ నీ విడుదల చేయగా 2261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి అవసరమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. స్టేజ్ టు ఆన్ లైన్ అప్లికేషన్ దరఖాస్తును ఈ నెల 13వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటుందని బోర్డు పేర్కొంది. అభ్యర్థులు తమ అనుమానాల నివృత్తికి హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్‌లో సంప్రదించాలని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు అన్నారు.