Share News

TDP-Janasena: జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నేడు

ABN , First Publish Date - 2023-11-09T07:27:09+05:30 IST

అమరావతి: తెలుగుదేశం, జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది. విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భేటీ కానుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ హాజరవుతున్నారు.

TDP-Janasena: జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నేడు

అమరావతి: తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) పొలిటికల్ యాక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది. విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో భేటీ కానుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హాజరవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పనపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.

అలాగే ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియలో జనసేన భాగస్వామ్యంతో కలిసి పని చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన ప్రజా పోరాటాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరవు, ధరల పెరుగుదల, వంటి అంశాలపై పోరాడాలని ఇప్పటికే టీడీపీ - జనసేన పార్టీలు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-09T12:18:32+05:30 IST