Konakalla Narayana: స్పీకర్ సాక్షిగా టీడీపీ సభ్యులపై దాడి..

ABN , First Publish Date - 2023-03-20T14:55:27+05:30 IST

ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో నేడు చీకటి రోజని.. సభాపతి సాక్షిగా టీడీపీ సభ్యులపై దాడి సిగ్గుపడాల్సిన దుస్థితి అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు.

Konakalla Narayana: స్పీకర్ సాక్షిగా టీడీపీ సభ్యులపై దాడి..

ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో నేడు చీకటి రోజని.. సభాపతి సాక్షిగా టీడీపీ సభ్యుల (TDP Leaders)పై దాడి సిగ్గుపడాల్సిన దుస్థితి అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ (Konakalla Narayana) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దళిత, వృద్ధ సభ్యులపై వైకాపా నేతలు (YCP Leaders) దాడికి పాల్పడ్డారని, అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిరంకుశ, నియంతృత్వ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) మీటింగ్‌లకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy), జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) పాదయాత్రలు (Padayatralu) చేసినప్పుడు చంద్రబాబు ఎక్కడా అడ్డంకులు సృష్టించకపోగా, వారి యాత్రలకు వెసులుబాటు కల్పించారని కొనకళ్ళ నారాయణ అన్నారు. అసెంబ్లీలో దాడి జరుగుతా ఉంటే మార్షల్స్ (Marshals), స్పీకర్ (Speaker) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవడంతో తట్టుకోలేకపోతున్నారని, పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందని.. ఈ అసహనాన్ని శాసనసభలో చాటుకున్నారన్నారు.

చట్టసభలో శాసనసభ్యులకు రక్షణ లేకపోతే మరెక్కడ దొరుకుతుంది? సామాన్యులకు రక్షణ ఏముంటుందని కొనకళ్ళ నారాయణ ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలోనే శాంతిభద్రతలు లేనప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని, సీఎం ఎదురుగా దళిత సభ్యుడిపై దాడి జరిగినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరని కొనకళ్ళ నారాయణ అన్నారు.

Updated Date - 2023-03-20T14:55:27+05:30 IST