Delhi: రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొన్న లోకేష్..

ABN , First Publish Date - 2023-09-19T08:04:23+05:30 IST

న్యూఢిల్లీ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు.

Delhi: రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొన్న లోకేష్..

న్యూఢిల్లీ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టు (Arrest)కు నిరసనగా మంగళవారం ఉదయం రాజ్‌ఘాట్‌ (Rajghat)లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతలు నల్ల రీబెన్‌లతో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ న్యాయస్థానంలో ఈ రోజు తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం ధర్మంపై నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఢిల్లీకి వచ్చి గాంధీ సమాధి వద్ద నివాళులర్పించే స్థితికి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు.

నారా లోకేశ్ నాలుగు రోజుల నుంచి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో అనేక జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలతో పాటుగా, లీగల్ పరంగా పలువురు న్యాయనిపుణులతో ఇప్పటికే విస్తృత చర్చలు జరిపారు. నిన్న పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పార్టీ ఎంపీలు, మాపీ ఎంపీలతో కలిసి ఆయన నిరసన తెలిపారు.

మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేబీఆర్ పార్కు వద్ద మంగళవారం ఉదయం టీడీపీ నేతలు, మద్దతు దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఐటీ ఉద్యోగులు, వాకర్స్ ఫ్లకార్డులతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-19T08:13:10+05:30 IST