వాలంటీర్ల‌పై ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ABN , First Publish Date - 2023-02-20T11:25:15+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు.

వాలంటీర్ల‌పై ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. వాలంటీర్ల (Volunteers)లో టీడీపీ (TDP) సానుభూతిపరులు ఉంటే వారిని తక్షణమే తొలగిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) వచ్చిన సమయంలో టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామన్నారు. వారు మారతారేమోనని వేచిచూశామన్నారు. కానీ వారిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. కొంతమంది మారారని, మరికొంతమది మారలేదన్నారు. అటువంటివారిని సొంత నాయకులు గుర్తించి.. చెబితే వెంటనే వారిని తొలగిస్తామని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిన్న (ఆదివారం) కొండపల్లిలో గృహసారధులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు అనుబంధంగా ఉంటూ... ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ఆనాడు జగన్ ఈ వాలంటీర్లను ఏర్పాటు చేశారు.

అయితే గత కొంతకాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు.. వాలంటీర్లను కార్యకర్తలుగా చూస్తున్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. వారిని వెంటనే తొలగించాలని చెబుతున్నారు. మంత్రులు గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేరుగా సమావేశంలో వాలంటీర్లలో కొంతమంది టీడీపీ సానుభూతిపరులు ఉన్నారని, అలాంటివారిని వెంటనే తొలగిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనియాంశంగా మారాయి. వాలంటీర్లకు ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇస్తున్నారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని పార్టీ కార్యకర్తలుగా చూస్తున్నారు. పార్టీ కోసమే పనిచేయాలని, లేకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గృహసారధులను నియమిస్తూ సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లపై పెత్తనం చేసేందుకు గృహసారధులను నియమించినట్లు వైకాపా నాయకులు

చెబుతున్నారు. దీనిపై కొంతమంది వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గృహసారధుల వ్యవస్థ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-02-20T13:58:05+05:30 IST