MP Raghurama: అవి జగన్ చేసిన హత్యలేనా?..
ABN , First Publish Date - 2023-01-02T14:40:52+05:30 IST
గుంటూరు (Guntur)లో ఓ ఎన్ఆర్ఐ (NRI) మంచి పనులు కొరకు సభ పెట్టి చంద్రబాబు (Chandrababu)ను పిలిచారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: గుంటూరు (Guntur)లో ఓ ఎన్ఆర్ఐ (NRI) మంచి పనులు కొరకు సభ పెట్టి చంద్రబాబు (Chandrababu)ను పిలిచారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రసంగం ముగించుకుని సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత బారీకేడ్లు విరిగిపోయాయని.. కావాలనే కొందరు సభలో వత్తిడి చేసినట్టు తెలుస్తోందన్నారు. కొందరు మంత్రుల పోస్టులు (Posts), స్టేట్‌మెంట్లు (Statements) చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు సభలో చనిపోయారు కాబట్టి ఆయనే
కారణమని అంటున్నారు... మరి అన్నమయ్య (Annamaiah) గేట్లు తెగిపోయి 50 మందికి పైగా చనిపోయారు.. అది జగన్మోహన్ రెడ్ది (Jaganmohanreddy) చేసిన హత్యలేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సభకు జనం విపరీతంగా వస్తున్నారు.. ముమ్మాటికీ దీని వెనుక కుట్ర ఉందని, దీని వెనుక ప్రభుత్వమా? లేక ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. శ్రీకాకుళంలో జనసేన (Janasena) మీటింగ్ ఉందని.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ (AP)లో దొంగనోట్ల పెన్షన్ దీవెన నడుస్తోందని, పెన్షన్లలో దొంగనోట్ల వ్యవహారం వెనుక పెద్ద కుతంత్రం ఉందని అన్నారు. ఫేక్ కరెన్సీ (Fake Currency) కేసును ఎన్ఐఏతో విచారణ జరిపించాలని రఘురామ అన్నారు.