NTR Dist.: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడి గ్రావెల్ దందా..
ABN , First Publish Date - 2023-04-18T11:06:02+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడు గ్రావెల్ దందా (Gravel Danda) చేస్తున్నాడు. మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం మండలాలకు భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడు గ్రావెల్ దందా (Gravel Danda) చేస్తున్నాడు. మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం మండలాలకు భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు. అనుమతులు తీసుకొనేది గోరంత అయితే.. తవ్వేది కొండంత... ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మైలవరం మండలం, వెదురుభీడెం గట్టును మింగేస్తున్నాడు. అనుమతుల పేరుతో ఇష్ట రాజ్యంగా గ్రావెల్ అమ్మకాలు చేస్తున్నాడు. 20 అడుగుల లోతులో గ్రావెల్ తరలిస్తున్నాడు. పదుల సంఖ్యలో టిప్పర్‌లు ఏర్పాటు చేసి వేల టన్నుల గ్రావెల్ తరలిస్తున్నాడు.
ఎమ్మెల్యే అనుచరుడు ఒక్కో టిప్పర్ గ్రావెల్‌ను రూ.7 వేల నుంచి 9 వేలకు అమ్ముతూ జేబు నింపుకుంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా.. మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. రైతులు సాగు చేసుకుంటున్న డి ఫారం భూముల్లో సైతం గ్రావెల్ తోలకాలు జరుగుతున్నాయి. గ్రావెల్ తరలింపుతో రహదారులు నాశనం అవుతున్నాయి. దుమ్ము ధూళితో పంట పొలాలు నిండిపోతున్నాయి. అనధికార లే అవుట్‌లకు భారీగా గ్రావెల్ అమ్మకొని సొమ్ము చేసుకుంటున్నాడు. గ్రావెల్ తరలింపుతో లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకుంటున్నాడు. మైనింగ్ అధికారులు తక్షణమే స్పందించి గ్రావెల్ తోలకాలు నిలుపుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.