MP Raghurama: నచ్చితే ఇవ్వడం... నచ్చకపోతే తీసేయడం ఏంటి?
ABN , First Publish Date - 2023-02-06T14:41:48+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డిని ఒక మాట అనలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
న్యూఢిల్లీ: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP MLA KotamReddy Sridhar Reddy) ఎక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)ని ఒక మాట అనలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు (Narsapuram MP RaghuRamakrishnam Rajju) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నచ్చితే సెక్యూరిటీ ఇవ్వడం ఏంటి, నచ్చకపోతే తీసేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఎవరో రిపబ్లిక్ పార్టీ అతను శ్రీధర్‌రెడ్డిని కొట్టుకుంటూ తీసుకొని వెళ్తామని బెదిరింపులు రావడం దురదుష్టకరమన్నారు. కొందరి వలన శ్రీధర్ రెడ్డి తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని అన్నారు. శ్రీధర్ రెడ్డి మనోవేదన చెప్పారని... ఆయనకు ప్రజా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నెల్లూరు మేయర్, కార్పొరేటర్లు కూడా రాజీనామా చేశారన్నారు. కోటం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే పార్టీ నుంచి బహిష్కించడం తప్ప ఏమీ చేయలేరని వ్యాఖ్యలు చేవారు.
స్పీకర్ వేటు వేస్తే మాత్రం మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని... అలా చేస్తే జనం ఛీ కొడతారని అన్నారు. శ్రీధర్ రెడ్డి లాంటి వారిని వదులుకున్న జగన్మోహన్ రెడ్డి దురదృష్టవంతుడని తెలిపారు. జగన్‌ను వదులుకున్న శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడన్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారన్నారు. ‘‘నేను చెప్పింది కూడా ఇసుక రేటు తగ్గించాలని సూచన చేస్తే పట్టించుకోలేదు. మూడేళ్లు అయ్యింది ఎం చేయలేకపోయారు’’ అని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నిన్న దాచేపల్లిలో ఓ ఎమ్మెల్యే ఒకరిపై దాడి చేశారని ఎంపీ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.