TR Dist.: మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్
ABN , First Publish Date - 2023-05-29T15:02:12+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్ జరిగింది. సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ. 15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం (Secretariat) నిధుల్లో గోల్‌మాల్ (Golmaal) జరిగింది. సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ. 15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది. దీంతో కార్యదర్శి గదికి వైసీపీ (YCP) సర్పంచ్ భర్త తాళం వేయించారు. పంచాయతీ వ్యవహారంలో సర్పంచ్ భర్త జోక్యంపై ఈవో రాణి (EO Rani) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక కార్యదర్శి గదికి తాళం వేయడంతో ఎంపీడీవో (MPDO) కార్యాలయం నుంచే ఈవో రాణి విధులు నిర్వహిస్తున్నారు.
మూలపాడు సచివాలయంలో రూ. 15 లక్షలు గోల్‌మాల్ జరిగిందనే వవ్యహారం బయటపడడంతో సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య గొడవ మొదలైంది. కార్యదర్శి గదికి వైసీపీ సర్పంచ్ భర్త తాళం వేసి.. ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. దీనిపై తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని... సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎన్టీఆర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.