Amaravathi: టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల కాపలా
ABN , First Publish Date - 2023-02-21T07:50:21+05:30 IST
అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయం (TDP Offrice)పై దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఛలో గన్నవరం (Chalo Gannavaram) కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయం (TDP Offrice)పై దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఛలో గన్నవరం (Chalo Gannavaram) కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కృష్ణాజిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్ల వద్ద గట్టి కాపలా పెట్టారు. మంగళవారం నేతలందరూ గన్నవరం వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు (TDP Leaders) ఇళ్ల నుంచి బయటకు వస్తే ముందస్తు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా (Bonda Uma) ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బయటకి రావొద్దని సూచించారు.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టిన తెలుగు మహిళా నాయకురాళ్లను (Telugu women leaders) గన్నవరంలో అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. మంగినపూడి బీచ్ సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మహిళా నాయకురాళ్లను ఉంచారు. మమ్మల్ని గన్నవరంలో అరెస్ట్ చేసిన పోలీసులు జిల్లా అంతటా తిప్పి తిప్పి చివరకు అర్ధరాత్రి మచిలీపట్నం ఊరు అవతల ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉంచారని మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.