KA Paul: నాకు అవకాశం ఇవ్వండి....
ABN , First Publish Date - 2023-01-03T12:59:14+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకడితే జనసేన అధినేత పవన్‌ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)తో జతకడితే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasen chief Pawan Kalyan) ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్అ (Prajashanti Party Chief KA Paul)న్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ (Telangana CM KCR)కు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. జగన్‌తో సహా ఎవరూ ఏపీని అభివృద్ధి చేయలేదని తెలిపారు. ‘‘నాకు అవకాశం ఇవ్వండి.. లక్ష కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తా’’ అంటూ కేఏ పాల్ పేర్కొన్నారు.