Vijayawada: కార్ రేసింగ్ ప్రమాదం కేసులో విచారణ వేగవంతం
ABN , First Publish Date - 2023-11-19T08:59:08+05:30 IST
విజయవాడ: బెజవాడలో కార్ రేసింగ్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువతులు, నలుగురు యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విజయవాడ: బెజవాడలో కార్ రేసింగ్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువతులు, యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరు ఈ గ్రూపులలో ఉన్నది.. రేసింగ్‌పై ఆరా తీస్తున్నారు.
వివరాలు..
విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్‌లో కార్ రేసింగ్ కలకలం రేపింది. బెంజ్ ఫార్చునర్ కారులో కొందరు యువకులు, యువతులు కలిసి రేసింగ్ చేసినట్లుగా సమాచారం. రేమేష్ ఆస్పత్రి సమీపంలో కారు రేసింగ్ జరుగుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రామవరప్పాడువైపు వెళుతున్న రెండు బైక్‌లను కారు ఢీ కొంది. ఈ ఘటనలో బైక్‌లపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు రేస్ పెట్టుకుని వేగంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.