AP Genco, విద్యుత్ సౌధలో ఉద్యోగాలపేరిట టోకరా.. ఏబీఎన్‌ను ఆశ్రయించిన బాధితులు..

ABN , First Publish Date - 2023-04-04T14:59:57+05:30 IST

ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వ్యక్తి బండారం బయటపడింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గోపీనాథ్ అనే వ్యక్తి తమ దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ ఓ బాధితుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు.

AP Genco, విద్యుత్ సౌధలో ఉద్యోగాలపేరిట టోకరా.. ఏబీఎన్‌ను ఆశ్రయించిన బాధితులు..

ఎన్టీఆర్ జిల్లా: ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వ్యక్తి బండారం బయటపడింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గోపీనాథ్ అనే వ్యక్తి తమ దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ ఓ బాధితుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)ని ఆశ్రయించాడు. ఏపీ జెన్‌కో (AP Genco)లో ఏడీఈ (ADE)గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న గోపీనాథ్ అనే వ్యక్తి ఏపీ జెన్‌కో, విద్యుత్ సౌధలో ఉద్యోగాలపేరిట టోకరా వేస్తున్నాడని బాధితులు ఆరోపించారు.

ఎంప్లాయ్ ఐడి నెంబర్ 062 పేరుతో ఐడెంటిటీ కార్డు సృష్టించిన గోపీనాథ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ (Training Institute)తో రాత పరీక్షలకు హాల్ టికెట్ (Hall Ticket) సృష్టించాడు. ఔట్ సోర్సింగ్ పోస్టు (Outsourcing Post)కు రూ. 30వేలు, లక్షన్నర ఇస్తే అడిషనల్ ఇంజనీర్ పోస్టు ఇస్తామంటూ మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితులు ఔట్ సోర్సింగ్ పోస్టుకు రూ. 25వేల చొప్పున కట్టి మోసపోయారు.

ఇదే విషయంపై ఏబీఎన్ ప్రతినిధి బాధితుడితో ఫోన్‌లో మాట్లాడించారు. పరీక్షల గురించి వెబ్ సైట్‌లో లేదని, తన స్నేహితుడు ప్రశ్నిస్తున్నాడని బాధితుడు అడగ్గా.. రూల్స్ మాట్లాడేవాళ్లను పక్కన పెట్టేయమని గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరీక్షలు డైరెక్టుగా కంపెనీ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. గోపీనాథ్ NTTPS డిప్లొమా అసోసియేషన్ లెటర్ హెడ్‌పై జాబ్ అప్రూవల్ లెటర్ జారీ చేశాడు. ఈ విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గోపీనాథ్ వలలో ఇంకెంతమంది నిరుద్యోగులు చిక్కుకున్నారో అన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-04-04T14:59:57+05:30 IST