Chandrababu: 'నాలుగేళ్ల నరకం' పేరుతో టీడీపీ కొత్త ప్రచారానికి శ్రీకారం..

ABN , First Publish Date - 2023-06-26T16:23:51+05:30 IST

అమరావతి: కొత్త ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

Chandrababu: 'నాలుగేళ్ల నరకం' పేరుతో టీడీపీ కొత్త ప్రచారానికి శ్రీకారం..

అమరావతి: కొత్త ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ (TDP) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విట్టర్ (Twitter) వేదికగా ఓ వీడియో (Video) విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల (YCP Leaders) అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ ‘నాలుగేళ్ల నరకం’ (Four Years of Hell) కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడతారని చంద్రబాబు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా ‘నాలుగేళ్ల నరకం’ రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని చెబుతూ.. నలభైఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ.. ప్రజల వద్దకు నేతలు తీసుకువెళతారని చంద్రబాబు తెలిపారు. కాగా క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు 'ఇది రాష్ట్రమా..? రావణ కాష్టమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ... చంద్రబాబు వీడియో విడుదల చేశారు.

Updated Date - 2023-06-26T16:23:51+05:30 IST