Bonda: కుట్రతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు
ABN , First Publish Date - 2023-10-07T15:45:29+05:30 IST
లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలంటూ కేసులు పెడతారా..? అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా (Bonda Umamaheswara Rao) ఉమ ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. ఇన్నర్ రింగ్
అమరావతి: లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలంటూ కేసులు పెడతారా..? అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా (Bonda Umamaheswara Rao) ఉమ ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. ఇన్నర్ రింగ్ అలైన్మెంటులో హెరిటేజ్ భూములే కోల్పోతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రస్తావన లేనప్పుడు హెరిటేజ్ సంస్థ అక్కడ భూములు కొనుగోలు చేసింది. ఐఆర్ఆర్ అలైన్మెంటు విషయంలో గెజిట్ ఇచ్చి మరీ ప్రజల ముందు ఉంచింది. ప్రజల నుంచి సీఆర్డీఏ అభ్యంతరాలు స్వీకరించింది. 1100కు పైగా అభ్యంతరాలు వస్తే దాన్ని సీఆర్డీఏ అధికారులు పరిశీలించారు. అలైన్మెంట్ విషయంలో ఎక్కడా తప్పిదాలు జరగలేదు. ఎమ్మెల్యే ఆర్కే ఐఆర్ఆర్ విషయంలో ఫిర్యాదు చేస్తే.. ఆఘామేఘాల మీద కేసు నమోదు చేశారు. ఒకే అబద్దాన్ని పది మంది మాట్లాడతారు. పదే పదే మాట్లాడి అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ భూమి అక్కడ లేనే లేదు. నారాయణ అద్దె భవనంలో కాలేజీ నిర్వహిస్తోంటే.. ఆ అద్దె భవనం కోసం అలైన్మెంట్ మార్చాలని ఒత్తిడి తెచ్చారని తప్పుడు ఆరోపణలు చేశారు. అద్దె భవనం కోసం అలైన్మెంట్ మార్చమని ఎవ్వరైనా కోరతారా..?, ఐఆర్ఆర్ నిర్మాణమే జరగలేదు. ఐఆర్ఆర్ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఐఆర్ఆర్ కోసం బడ్జెట్ కేటాయింపులే జరపలేదు. జగన్‌ది దరిద్రపాదం.. అమరావతి నాశనమైంది. తన మీదున్న జైలు ముద్రను చంద్రబాబు (Chandrababu) పైనా వేయాలనేదే జగన్ (Cm jagan) కుట్ర. న్యాయ స్థానాల్లో కూడా చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు నిలబడవు.’’ అని చెప్పుకొచ్చారు.