Home » Bonda Umamaheswara Rao
వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు(Rains) కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి భారీ వర్షాలు, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై వివరించారు.
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
Andhrapradesh: మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టులు, మీడియాతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు మీడియా గొంతు నొక్కాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు.
రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలో సీఎం జగన్ ఐప్యాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటికు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం, గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమమహేశ్వరరావు అన్నారు.
Andhrapradesh: ఏపీలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు.
ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస పై ఎన్నికలసంఘం దృష్టి పెట్టాలని పోలీసులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కోరారు. వైసీపీ ఓటమి భయంతో టీడీపీ నాయకుల ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందన్నారు. పిన్నెల్లి, చెవిరెడ్డి రౌడీఇజంపై డీజీపీ దృష్టి పెట్టాలని.. వెంటనే పినెల్లి సోదరులను అరెస్టు చేయాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితి మీరిన జోక్యం చేసుకుంటోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారిని కొట్టినా నామ మాత్రపు సెక్షన్లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గా ప్రసాద్లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమ అన్నారు.