Minister Peddireddy: ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు..
ABN , First Publish Date - 2023-06-05T15:01:38+05:30 IST
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీ (YCP)కి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) స్పష్టం చేశారు.
అమరావతి: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీకి (YCP) లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) ఎన్నికలు రెండూ కలిసే వస్తాయని, అప్పుడే ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నారు.
చంద్రబాబు (Chandrababu) రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని, వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. వేరే పార్టీల అండ కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. తాము బలంగా ఉన్నామని, వేరే పార్టీల గురించి తమకు అనవసరమని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి తానేం మాట్లాడనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.