Varla Ramaiah: డీజీపీ ప్రెస్ నోట్ హాస్యాస్పదంగా, బాధ్యతారాహిత్యంగా ఉంది...

ABN , First Publish Date - 2023-06-07T15:40:03+05:30 IST

అమరావతి: టంగుటూరుకు చెందిన హనుమాయమ్మ అనే దళిత మహిళను వైసీపీ శ్రేణుల మద్దతుతో ట్రాక్టర్‌తో తొక్కించి అతిదారుణంగా హత్య చేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు.

Varla Ramaiah: డీజీపీ ప్రెస్ నోట్ హాస్యాస్పదంగా, బాధ్యతారాహిత్యంగా ఉంది...

అమరావతి: టంగుటూరుకు చెందిన హనుమాయమ్మ అనే దళిత మహిళను వైసీపీ (YCP) శ్రేణుల మద్దతుతో ట్రాక్టర్‌తో తొక్కించి అతిదారుణంగా హత్య చేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆ హత్యపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డి (DGP Rajendranath Reddy) బుధవారం విడుదల చేసిన ప్రెస్ నోట్ (Press Note) చాలా హాస్యాస్పదంగా, బాధ్యతారాహిత్యంగా ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు తెలియజేయకుండా ఇది హత్య కేసు, పోలీసులు అరెస్టు చేస్తారు, అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు పంపుతాం అని పాత్రికేయులకు నోటు పంపడం డీజీపీ ప్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు.

దళిత మహిళ ఘోరాతిఘోరంగా హత్య గావించబడితే డీజీపీ స్పందించిన తీరు చాలా బాధాకరమని, ఇది ఆయన హోదాకు, స్థాయికి తగని పని అని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళ దారుణ హత్య కేసులో దర్యాప్తు సరిగా చేయని వారు కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం నేరస్థులని కూడా డీజీపీ గ్రహించాలన్నారు. ఇప్పటికైనా డీజీపీ దళిత మహిళ హత్య కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయించాలని కోరారు. ఆమె హత్యకు కారకులైన మద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ప్రోత్సహించిన అధికారపార్టీ పెద్దలను కూడా అరెస్టు చేయాలన్నారు. హత్య గావించబడిన దళిత మహిళ హనుమాయమ్మ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-07T15:40:03+05:30 IST