Varla Ramaiah: పులివెందుల ఫ్యాక్షనిజాన్ని గన్నవరంలో అమలు చేశారు...
ABN , First Publish Date - 2023-02-23T16:31:16+05:30 IST
అమరావతి: గన్నవరం ఘటనపై జిల్లా ఎస్పీ జాషువా (SP Jashua) చెప్పినవన్నీ అబద్దాలేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.
అమరావతి: గన్నవరం ఘటనపై జిల్లా ఎస్పీ జాషువా (SP Jashua) చెప్పినవన్నీ అబద్దాలేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. గురువారం ఆయన ఇక్క
డ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ (TCP) అరాచక శక్తులు కలిసి ఈ దాడి చేశారని విమర్శించారు. పులివెందుల (Pulivendula) ఫ్యాక్షనిజాన్ని (Factionalism) గన్నవరంలో అమలు చేశారన్నారు. ఎస్పీ జాషువాకు ఇవన్నీ తెలుసునని... ఆయన అమాయకుడు ఏమీకాదని అన్నారు.
టీడీపీ నేత దొంతు చిన్నాను బెదిరించిన ఘటనలో పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ గుండాలు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం చేశారని, అడ్డుకోవాల్సిన పోలీసులు వద్దంటూ వారిని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసు వ్యవస్థను ఇంత దిగజారుస్తారా? అంటూ మండిపడ్డారు. సిఐపై దాడి చేసేలా రెచ్చగొట్టి, కులంతో దూషించారని పట్టాభిపై కేసు పెడతారా?... దాడి చేసిన వారిపై ఒక్కకేసు కూడా నమోదు చేయలేదేమని ప్రశ్నించారు. వీడియోలో వ్యక్తులు కనిపిస్తున్నా అరెస్టు చేయరా? అంటూ నిలదీశారు.
రక్షకులు, భక్షకులు కలిసి చేసిన దాడి ఇదని, పట్టాభిని ఊరంతా తిప్పితూ చిత్ర హింసలు పెడతారా? అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. సిఐ కనకారావుకు చిన్న దెబ్బ తగిలితే ఐసియూలో పెట్టి డ్రామా ఆడతున్నారని అన్నారు. సిఐ తన సర్వీసు మొత్తంలో ఈ నింద మోయాల్సి ఉంటుందన్నారు. సిఐ కనకారావుకు హాని తలపెట్టి .. టీడీపీ నేత పట్టాభిపై నింద మోపుతారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆ సిఐకి పూర్తిగా రక్షణ కల్పించాలని కోరారు. ఎస్పీని సజ్జల డైరెక్ట్ చేస్తున్నారా? సిఐ ప్రాణాలకు ముప్పు లేదని జాషువా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్పీ ట్రాప్‌లో పడిన సిఐ తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నారని వర్ల రామయ్య అన్నారు. తలకు గాయమైతే ఐసియూలో పెట్టారంటేనే రక్షకులు, భక్షకుల కుట్రలు అర్ధం అవుతున్నాయన్నారు. సిఐ కనకారావు ఎస్సీ క్రిస్టియన్ అని రాశారని, మరి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఎలా పెట్టారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ చేసిన ఎమ్మెల్యే వంశీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పట్టాభిని కొట్టలేదని ఎస్పీ గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ముసుగు వేసి మరీ నడవలేకుండా కొడతారా అంటూ మండిపడ్డారు. పట్టాభి విసిరిన రాయి సిఐకి తగిలిందని చెప్పడం దుర్మార్గం కాదా అన్నారు. చట్టాన్ని వైసీపీ చుట్టంగా మార్చిన పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని వర్ల రామయ్య హెచ్చరించారు.