AP News: 22న బిశ్వభూషణ్ హరిచందన్‌కు వీడ్కోలు.. కొత్త గవర్నర్‌కు స్వాగతం..
ABN , First Publish Date - 2023-02-20T15:22:48+05:30 IST
కృష్ణా జిల్లా: ఈనెల 22న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan)కు రాష్ట్ర ప్రభుత్వం (State Govt.) వీడ్కోలు పలకనుంది.
కృష్ణా జిల్లా: ఈనెల 22న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan)కు రాష్ట్ర ప్రభుత్వం (State Govt.) వీడ్కోలు పలకనుంది. అలాగే అదే రోజు సాయంత్రం నూతన గవర్నర్ (New Governor) రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ (Retired Judge Justice Abdul Nazeer)కు స్వాగతం పలికేందుకు అధికారులు కార్యక్రమాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ పి.జాషువా, జాయింట్ కలెక్టర్ డా.అపరాజిత సింగ్ వివిధ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు.
కాగా వారం రోజుల క్రితం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. (Center appointed new governors). అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు కొత్త గవర్నర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛతీస్ఘడ్ రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్ అనసూయ, లడఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలండ్ గవర్నర్‌గా గణేషన్, మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్, బీహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బి.డి.మిశ్రాను కేంద్రం నియమించింది.