Kuppam Railway Station: కుప్పం ప్రజలకో గుడ్ న్యూస్.. అదేంటంటే...

ABN , First Publish Date - 2023-08-29T11:11:39+05:30 IST

డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - షిర్డీ సాయినగర్‌(Chennai Central - Shirdi Sainagar)ల మధ్య సంచరించే సూపర్‌ ఫాస్ట్‌రైలుకు సెప్టెంబరు 5 నుంచి

Kuppam Railway Station: కుప్పం ప్రజలకో గుడ్ న్యూస్.. అదేంటంటే...

- ఒక నిమిషం ఆగనున్న చెన్నై సెంట్రల్‌ - షిర్డీ సాయినగర్‌ రైలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - షిర్డీ సాయినగర్‌(Chennai Central - Shirdi Sainagar)ల మధ్య సంచరించే సూపర్‌ ఫాస్ట్‌రైలుకు సెప్టెంబరు 5 నుంచి 2024 మార్చి 6 వరకు చిత్తూరు జిల్లా కుప్పం(Chittoor District Kuppam)లో ఒక నిమిషం హాల్ట్‌ సదుపాయం కల్పించారు. ఈ మేరకు నైరుతి రైల్వే నగరంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 22601 రైలు కుప్పం స్టేషన్‌లో మధ్యాహ్నం 2.14కు విచ్చేసి 2.15కు బయల్దేరి వెళ్ళనుంది. కాగా 22602 రైలు తిరుగు ప్రయాణంలో షిర్డీ నుంచి చెన్నయ్‌కు వస్తూ కుప్పంలో ఉదయం 4.44 నుంచి 4.45 వరకు ఒక నిముషం ఆగనుంది. షిర్డీ కు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రకటన పేర్కొంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-29T11:16:19+05:30 IST