Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

ABN , First Publish Date - 2023-08-04T13:10:17+05:30 IST

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది.

Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

కర్నూలు: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా తరలించారు వైద్యులు. అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో ఆయనకు సంబంధించిన లంగ్స్‌, కిడ్నీలను హైదరాబాద్, బెంగళూరు ఆస్పత్రులకు గ్రీన్‌ఛానల్ ద్వారా తరలించారు. ఈనెల 1న బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన అంకెవల్లి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఆయనను అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జగదీష్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వైద్యుల సూచనల మేరకు అంకెవలి జగదీష్ అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. దీంతో కిమ్స్ సవేరా ఆస్పత్రి నుంచి జగదీష్ ఊపిరితిత్తులను కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు అంబులెన్స్‌లో అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అలాగే కిడ్నీలను బెంగళూరుకు రోడ్డు మార్గం ద్వారా అంబులెన్స్‌లో తరలించారు. అవయవాలు తరలింపులో ఐదుగురు వైద్యుల మెడికల్ టీమ్ పాల్గొంది.

Updated Date - 2023-08-04T13:10:17+05:30 IST