Share News

Nandyala: శ్రీశైలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2023-10-15T07:56:23+05:30 IST

నంద్యాల: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు శ్రీశైలం భ్రమరాంబాదేవి నవదుర్గ అలంకారాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Nandyala: శ్రీశైలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

నంద్యాల: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు శ్రీశైలం భ్రమరాంబాదేవి నవదుర్గ అలంకారాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శాస్త్రోక్తంగా అమ్మవారి యగశాల ప్రవేశంతో దసరా ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ సాయంత్రం భ్రమరాంబికాదేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శమివనున్నారు. బృంగివహంపై ఆశీనులై ఆదిదంపతులు పూజలందుకోనున్నారు. క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండువగా శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరుగుతుంది.

తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జపపారాయణలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. ప్రత్యేక క్యూలైన్ల నిర్వహణ, ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరీరణ, గ్రామోత్సవాన్ని తిలకించేందుకు ప్రధాన ఆలయానికి ఎల్‌ఈడీ స్కీన్లు తదితర ఏర్పాట్లను ఈఓ పెద్దిరాజు పర్యవేక్షిస్తున్నారు.

మొదటిరోజు శైలపుత్రిగా అమ్మవారు

దసరా మహోత్సవాల సందర్భంగా మల్లికార్జున, భ్రమరాంబ అమ్మవార్లు తొలిరోజు ఆదివారం అమ్మవారు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేస్తారు. గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం, కంకణపూజ, అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, చండీ కలశస్థాపన, కుంకుమార్చనలు, తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం నుంచి అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అనంతరం భృంగివాహనంపై దేవేరులు విహరిస్తారు. రేపు(సోమవారం) అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమివ్వగా, ఆదిదేవులు మయూర వాహనంపై విహరిస్తారు.

Updated Date - 2023-10-15T07:56:23+05:30 IST