Srisailam: ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు
ABN , First Publish Date - 2023-07-28T23:51:25+05:30 IST
శ్రీశైలం( Srisailam)లో ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు(Shravan Masotsavam) నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు తెలిపారు.
నంద్యాల(Nandyala): శ్రీశైలం( Srisailam)లో ఆగస్టు(August) 17వ తేదీ నుంచి సెప్టెంబర్(September) 15వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు(Shravan Masotsavam) నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రావణమాస పర్వదినాలల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలను దేవస్థానం నిలిపివేసింది. ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం(AdhiKa shravanamasam) ఈనెల 18 నుంచే రావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాతో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.అధిక శ్రవణ మాసం కారణంగా ఆగస్టు 12వ తేదీ నుంచే మాసంతం వరకు శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు నిలిపివేసింది.ఆగస్టులో జలాశయం గేట్లు ఎత్తితే రద్దీ పెరుగుతుందని శని, ఆది, సోమవారాల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేసింది.శ్రావణమాసంలోనూ శని, ఆది, సోమవారాల్లో స్లాట్ ప్రకారం యధావిధిగా శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చింది. ఆర్జితసేవ, స్పర్శ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో లభ్యతను బట్టి శ్రీశైలం రావాలని భక్తులను దేవస్థానం కోరింది.