Nandyala: యోగిని శాంభవి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-12-12T13:01:29+05:30 IST
నంద్యాల: కొన్నేళ్ల క్రితం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఫేమస్ అయిన చిన్నారి యోగిని శాంభవి మరోసారి వార్తల్లోకి వచ్చారు. పెరిగి పెద్దైన ఆమె మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బ్రహ్మంగారు మళ్లీ జన్మిస్తారని అన్నారు.
నంద్యాల: కొన్నేళ్ల క్రితం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఫేమస్ అయిన చిన్నారి యోగిని శాంభవి (Yogini Shambhavi) మరోసారి వార్తల్లోకి వచ్చారు. పెరిగి పెద్దైన ఆమె మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బ్రహ్మంగారు మళ్లీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని అన్నారు. బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయని, జరుగుతున్నాయని తెలిపారు. బ్రహ్మంగారి కాలజ్ఞానిని ఇంగ్లీషులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నట్లు శాంభవి ప్రకటించారు. ఇటీవల నంద్యాల వచ్చిన శాంభవి బస్టాండ్ సమీపంలోని మధువర్ణ రామలింగం మందిరంలో పూజలు చేశారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటూ.. సంస్కృతం వేదాలు నేర్చుకున్నానన్నారు. శాంభవి మళ్లీ నంద్యాలకు రావడం.. అక్కడ బ్రహ్మంగారి గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
13 ఏళ్ల తర్వాత యోగిని శాంభవి మళ్లీ మహనంది మండలంలో ప్రత్యక్షమయ్యారు. కార్తీక మాసం సందర్బంగా సూర్యనంది, అలాగే నంద్యాల బస్టాండ్ పక్కన ఉన్న శివాలయంలో శాంభవితోపాటు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2009, 2010 సూర్యనందిలో శాంభవి ఐదేళ్ల వయసులో భవష్యవాణి చెబుతూ అందరినీ అకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి జనాలు తరలి వచ్చి శాంభవీకి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నంద్యాల నుంచి హిమాలయాలకు వెళ్లిపోయారు. అక్కడ ఆశ్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చదువుతూ.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ నంద్యాలకు వచ్చారు.