AP News : మచిలీపట్నానికి కెనడాలో చనిపోయిన లెనిన్కుమార్ భౌతికకాయం

ABN , First Publish Date - 2023-07-18T08:18:03+05:30 IST

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి లెనిన్‌ నాగకుమార్‌ (Lenin Nagakumar) ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.స్నేహితులతో కలిసి కెనడాలోని (Canada) సిల్వర్‌ఫాల్స్‌‌కు వెళ్లిన లెనిన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల క్రితం మృతిచెందిన లెనిన్ భౌతికకాయం మంగళవారం నాడు స్వగ్రామమైన మచిలీపట్నానికి (Machilipatnam) చేరింది..

 AP News : మచిలీపట్నానికి కెనడాలో చనిపోయిన లెనిన్కుమార్ భౌతికకాయం

కృష్ణా : ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి లెనిన్‌ నాగకుమార్‌ (Lenin Nagakumar) ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.స్నేహితులతో కలిసి కెనడాలోని (Canada) సిల్వర్‌ఫాల్స్‌‌కు వెళ్లిన లెనిన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల క్రితం మృతిచెందిన లెనిన్ భౌతికకాయం మంగళవారం నాడు స్వగ్రామమైన మచిలీపట్నానికి (Machilipatnam) చేరింది. MS కోసం 2021లో చింతగుంటపాలెం వాసి లెనిన్ కెనడా వెళ్లాడు. అక్కడ MS పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా.. జులై 4న కెనడాలోని సిల్వర్ వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందాడు.


ఎంపీ కృషితో..

ఎంపీ వల్లభనేని బాలశౌరి (MP Vallabbhaneni Balashowry) కృషి ఫలితంగా లెనిన్ భౌతికకాయం స్వగ్రామానికి చేరింది. బాలశౌరి.. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో (Jaishankar) పాటు ఒట్టవాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మతో మాట్లాడి లెనిన్ భౌతికకాయాన్ని మచిలీపట్నానికి తీసుకురావడంలో సహాయం కోరారు. దీంతో.. ప్రత్యేక విమానంలో గత రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరగా.. ప్రత్యేక అంబులెన్స్లో మచిలీపట్నంలోని చింతగుంటపాలెంకు తరలించారు. ఇవాళ లెనిన్కుమార్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.

Updated Date - 2023-07-18T09:08:18+05:30 IST