Kotappakonda: కోటప్పకొండలో మద్యం విక్రయం

ABN , First Publish Date - 2023-02-17T21:29:32+05:30 IST

పల్నాడు జిల్లా (Palnadu District) కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా 16 నుంచి 19 వరకు మద్య నిషేధం విధించినట్లు ఎక్పైజ్‌ శాఖ ప్రకటించింది. దీనిని ఆ శాఖ అధికారులే తుంగలో తొక్కారు.

Kotappakonda: కోటప్పకొండలో మద్యం విక్రయం

నరసరావుపేట: పల్నాడు జిల్లా (Palnadu District) కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా 16 నుంచి 19 వరకు మద్య నిషేధం విధించినట్లు ఎక్పైజ్‌ శాఖ ప్రకటించింది. దీనిని ఆ శాఖ అధికారులే తుంగలో తొక్కారు. బహిరంగంగా ఎక్సైజ్‌ శాఖ కోటప్పకొండలో మద్యం షాపు ద్వారా మద్యం విక్రయిస్తున్నది. ప్రభుత్వ మద్యం షాపు ద్వారా సదరు శాఖ అధికారులే మద్యం విక్రయాలకు తెరలేపారు. తిరునాళ్లకు వచ్చే మందుబాబులు ఇబ్బంది పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పేరుకే షాపును మూసివేసినట్లుగా షట్టరు వేశారు. షాపు పక్కనే ఉన్న హోటల్‌కు మద్యం నిల్వలను అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు తరలించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ వారు సొమ్ము చేసుకుంటున్నారు. హోటల్‌ గదిలో మద్యం నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు అండదండలతో సాగుతున్న అక్రమ మద్యం విక్రయంపై చర్యలు తీసుకునేవారే కరువయ్యారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా అక్రమ మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - 2023-02-17T21:29:32+05:30 IST