Yuvagalam Padayatra: జోరువానలోనూ కొనసాగుతున్న లోకేశ్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2023-04-29T17:37:45+05:30 IST

అప్పటి వరకూ భగ భగమండిన ఎండలు. ప్రజల కష్టాలు కళ్లారా చూడాలని పాదయాత్ర చేపట్టిన యువనేత తపనను ప్రకృతి అర్థం చేసుకుందేమో..

Yuvagalam Padayatra: జోరువానలోనూ కొనసాగుతున్న లోకేశ్‌ పాదయాత్ర

కర్నూలు: అప్పటి వరకూ భగ భగమండిన ఎండలు. ప్రజల కష్టాలు కళ్లారా చూడాలని పాదయాత్ర చేపట్టిన యువనేత తపనను ప్రకృతి అర్థం చేసుకుందేమో.. అంతలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలై వర్షంగా మారింది. ప్రజల అభిమాన వర్షమూ అలాగే కురిసింది. వానలోనే యువనేత పాదయాత్ర చేస్తూ... వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటుంటే... టీడీపీ (TDP) శ్రేణులూ ఆయన వెంట కదిలాయి. జోరువానలోనూ టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) పాదయాత్ర కొనసాగుతోంది. ఎమ్మిగనూరు (Yemmiganur)లో లోకేశ్‌ను వడ్డెర సామాజిక వర్గీయులు కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత మాజీసీఎం చంద్రబాబుదేనని తెలిపారు. బీసీలను బ్యాంక్‌ బోన్‌ అన్న సీఎం జగన్‌ (CM Jagan).. నేడు వాళ్ల బ్యాక్‌ బోన్ విరుస్తున్నారని దుయ్యబట్టారు. వడ్డెర్ల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలను తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. విధులు, నిధులు, కనీసం కుర్చీలూ లేని కార్పొరేషన్లు ఇచ్చి జగన్ మోసం చేశారని నారా లోకేశ్‌ మండిపడ్డారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని తాము తలపెడితే.. వైసీపీ నిలిపేసిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేస్తామని ప్రకటించారు. దామాషా ప్రకారం వడ్డెర కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తామని, వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

శుక్రవారం పాదయాత్ర సాయంత్రం మాచాపురం గ్రామానికి రాగానే జోరువాన మొదలైంది. ‘అన్నా.. ఇంతటి వర్షంలో నడుస్తారా..? వాన వెలిసే వరకు మా ఇంట్లో రెస్ట్‌ తీసుకోండి.. వర్షానానికి తడవొద్ద’ని మహిళలు లోకేశ్‌ను కోరారు. ‘అమ్మా..! మీ ఆశీర్వాదమే నన్ను నడిపిస్తుంది. అడుగు ముందుకేశాక ఆపేది లేదు.. గమ్యస్థానం చేరేదాక నడుస్తా..’ అంటూ వానలోనే లోకేశ్‌ ముందుకుసాగారు.

Updated Date - 2023-04-29T17:37:45+05:30 IST