Lokesh: 106వ రోజుకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర.. నేడు ఆముదాలమెట్టలో లోకేష్ ఎంట్రీ

ABN , First Publish Date - 2023-05-21T07:22:57+05:30 IST

టీడీపీ (TDP) యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) 106వ రోజుకు చేరుకుంది.

Lokesh: 106వ రోజుకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర.. నేడు ఆముదాలమెట్టలో లోకేష్ ఎంట్రీ

నంద్యాల: టీడీపీ (TDP) యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) 106వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు బనగానపల్లె నియోజకవర్గం ఆముదాలమెట్టలో మైనింగ్ కార్మికులతో నారా లోకేష్ మాట్లాడనున్నారు. చౌదరిదిన్నెలో రైతులతో లోకేష్ సమావేశం కానున్నారు. కోవెలకుంట్లలో ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులతో సమావేశం అనంతరం కోవెలకుంట్ల అమ్మవారి శాలలో ఆర్వ వైశ్యులతో లోకేష్ మాట్లాడనున్నారు. కుందూ బ్రిడ్జి దగ్గర కుందూ పోరాట సమితి రైతులు, భీమునిపాడు, కంపమల్లమిట్టలో స్ధానికులను కలిసి వారి సమస్యలను లోకేష్ తెలుసుకోనున్నారు. రాత్రి 9.50 గంటలకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దొర్నిపాడు శివారులోని విడిది కేంద్రంలో నారా లోకేష్ రాత్రి బస చేయనున్నారు.

Updated Date - 2023-05-21T07:23:14+05:30 IST