Nara Lokesh: మా హ‌రి మావ‌య్య‌! నిబ‌ద్ధ‌త‌కు నిలువెత్తు రూపం

ABN , First Publish Date - 2023-08-29T10:31:10+05:30 IST

దివంగత టీడీపీ నేత హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. తన మామయ్య హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా యువనేత గుర్తుచేసుకున్నారు.

Nara Lokesh: మా హ‌రి మావ‌య్య‌! నిబ‌ద్ధ‌త‌కు నిలువెత్తు రూపం

అమరావతి: దివంగత టీడీపీ నేత హరికృష్ణ (Nandamuri Harikrishna) వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (TDP Leader Nara Lokesh) నివాళులర్పించారు. తన మామయ్య హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా యువనేత గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మా హ‌రి మావ‌య్య‌! నిబ‌ద్ధ‌త‌కు నిలువెత్తు రూపం. దూకుడు ఆయ‌న నైజం, కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వ‌తం. మేన‌ల్లుడిగా ఆయ‌న ఆత్మీయ‌త పొంద‌డం నా అదృష్టం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా చేప‌ట్టిన ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన నంద‌మూరి హ‌రికృష్ణ గారు లేని లోటు ఎవరు తీర్చ‌లేనిది. హ‌రి మావ‌య్య‌ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-08-29T10:31:10+05:30 IST