YCP Minister చంద్రబాబు, చిరంజీవిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
ABN , First Publish Date - 2023-08-08T17:39:58+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu), సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై (Chiranjeevi) మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu), సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై (Chiranjeevi) మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పుంగనూరు ఘటనకు కర్త కర్మ క్రియ అన్ని చంద్రబాబు నాయుడు. ఈ ఘటనలో చంద్రబాబును రౌడీ షీటర్ గా ప్రకటించాలి. పుంగనూరు ఘటనలో మా పార్టీ నేతలే లేరు. వైసీపీని రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన ఘటన. ఆ ఘటన కావాలని డ్యామేజ్ చేయడం కోసం చేశారు. కావాలని ప్రేరేపించి, పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడ ఎవరైనా చనిపోతే దాన్ని వివాదం కింద మార్చుదామనే ఆలోచనతోనే అంతా చేశారు. హింసాత్మక రాజకీయాల్లో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. శవాలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. పుంగనూరు ఘటన బాధితులకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించాం. చంద్రబాబు వేసిన స్కెచ్‌లో ఇది ఒక భాగమే. తెలుగు దేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా చేశారు. చంద్రబాబు రూట్ మ్యాప్‌లో పుంగనూరు లేదు. చంద్రబాబుకు ఏదైనా జరుగుతాదేమోనని మా భయం కూడా. భద్రత విషయంలో ఏదైనా జరిగితే ప్రభుత్వoపై నింద వేస్తారని భయం. చంద్రబాబు ఎంత కాలం ఉంటే మా పార్టీకి అంత మంచిది." అని అమర్నాథ్ అన్నారు.
"చిరంజీవిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి మా కన్నా ముందు వాళ్ల తమ్ముడికి చెప్తే బాగుంటుంది. వాళ్ల తమ్ముడికి చెప్పిన తర్వాత ప్రభుత్వానికి సలహానిస్తే బాగుంటుంది. వారంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. సినిమాల్లోకి రాజకీయాలను తీసుకువచ్చింది ఎవరో చెప్పండి. రాంబాబుని ఒక క్యారెక్టర్‌గా పెట్టారు. దానిపై ఎందుకు మాట్లాడరు." అని మంత్రి చిరంజీవిని ప్రశ్నించారు.