Kakani Goverdhan Reddy: 103 రైతు బజార్లలో సబ్సిడీ టమాటా
ABN , First Publish Date - 2023-07-12T10:43:24+05:30 IST
టమాటా ధరలు కొండెక్కిన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సీడీ రూపంలో ప్రజలకు టమాటాను అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
విజయవాడ: టమాటా ధరలు కొండెక్కిన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సీడీ రూపంలో ప్రజలకు టమాటాను అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Goverdhan Reddy) మాట్లాడుతూ.. సబ్సీడీ టమాటా అమ్మకాలు పరిశీలించామని తెలిపారు. దేశ వ్యాప్తంగా టమాటా పంట తగ్గిపోవడమే ఈ ధరలకు కారణమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మొత్తం 103 రైతు బజార్లలో సబ్సీడీ టమాటా ఇస్తున్నామన్నారు. 65 నుంచి 70 టన్నులు ఒకరోజుకు ఒక రైతు బజార్లో అందిస్తున్నామని తెలిపారు. టమాటా నేలపాలైనా, కొండెక్కినా.. రైతులను వినియోగదారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని టన్నులు ఇస్తోంది... ఎన్ని రైతు బజార్లలో ఇచ్చారో చెప్పాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.