MLA Rachamallu : అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు

ABN , First Publish Date - 2023-04-26T12:29:56+05:30 IST

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించబోరని మన సాక్షిగా పూర్తిగా నమ్ముతున్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

MLA Rachamallu : అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు

కడప : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించబోరని మన సాక్షిగా పూర్తిగా నమ్ముతున్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా తాను ఇదే చెబుతున్నానని.. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదన్నారు. అవినాష్ రెడ్డి హత్య చేశాడని రుజువైతే ఇక తాను ఈ రాజకీయాల్లో ఉండనని.. అలాగే తనతో పాటు మరో తొమ్మిది మంది రాజీనామా చేస్తారని తెలిపానని అన్నానన్నారు. అయితే నేరస్థుడని తేలితే రాజీనామా చేస్తానన్నాను కానీ నిందితుడిగా తేలితే కాదని తాజాగా స్పష్టం చేశరాు. న్యాయ స్థానంలో అవినాశ్ రెడ్డి నేరం రుజువు ఐతే రాజీనామా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారు కానీ బెయిల్ మీద బయటకు వస్తారని రాచమల్లు తెలిపారు.

Updated Date - 2023-04-26T12:29:56+05:30 IST