Raghurama: ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయొద్దు.. కేంద్రానికి రఘురామ లేఖ

ABN , First Publish Date - 2023-05-20T14:25:54+05:30 IST

ఆర్- 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ పూరి సింగ్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

Raghurama: ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయొద్దు.. కేంద్రానికి రఘురామ లేఖ

న్యూఢిల్లీ: ఆర్- 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ పూరి సింగ్‌కు(Union Urban Development Minister Hardeep Puri Singh) ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishnaraju) లేఖ రాశారు. సిద్ధంగా ఉన్న 30 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని జగ‌న్‌కు (AP CM YS Jaganmohan Reddy) సూచించాలని కేంద్ర మంత్రి హర్ధీప్ పూరిని కోరారు. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపించింది. ఆర్-5 జోన్‌లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ఏపీ పంపిన ప్రతిపాదనలపై స్పందించవద్దని కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. అమరావతిపై కోపంతో మూడు రాజధానులకు జగన్ తెరలేపారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-05-20T14:25:54+05:30 IST