Share News

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

ABN , First Publish Date - 2023-11-13T20:23:46+05:30 IST

నెల్లూరు జిల్లా దువ్వూరు(Duvvuru)లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన(Janasena) నేతలపై వైసీపీ(YSRCP) నేతలు దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఖండించారు.

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

అమరావతి: నెల్లూరు జిల్లా దువ్వూరు(Duvvuru)లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన(Janasena) నేతలపై వైసీపీ(YSRCP) నేతలు దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఖండించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. సీఎం జగన్ అక్రమ రవాణాను అరికట్టకుండా వైసీపీ నేతలనే దాడులకు పంపుతున్నారు.

ఇసుక రవాణా వైసీపీ వాళ్లకు ఆదాయ వనరుగా మారిపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో పెన్నా తీరంలో అడ్డగోలుగా ఇసుక తవ్వి దువ్వూరు మీదుగా తరలిస్తున్నారు. ఇసుక లారీలు అడ్డుకొన్న జనసేన నాయకులపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. పోలీసులు తక్షణమే నిందితుల్ని అరెస్ట్ చేయాలి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి" అని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-13T20:25:10+05:30 IST