Nara Lokesh: జగన్ జె-ట్యాక్స్‌ విధానాలతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి

ABN , First Publish Date - 2023-08-19T19:39:51+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.

Nara Lokesh: జగన్ జె-ట్యాక్స్‌ విధానాలతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.


"జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రకరకాల పన్నులతోపాటు జె-ట్యాక్స్ కోసం వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు. నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తాం. ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం." అని లోకేష్ అన్నారు.

టీడీపీ యువనేత లోకేష్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ ఆర్యవైశ్య నేతలు వినతిపత్రం సమర్పించారు.

"టీడీపీ పాలనలో ఆర్యవైశ్యులకు దక్కిన గౌరవం, అందిన అవకాశాలు మరువలేనివి. ఎన్నికల్లో సీట్లు, నామినేటెడ్ పదవులు, వివిధ స్థానాల్లో పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టి నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మా కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం మాకు నిధులు కేటాయించాలి. నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం అవకాశాలివ్వాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలి. మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి." అని లోకేష్‌ను ఆర్యవైశ్యులు కోరారు.

Updated Date - 2023-08-19T19:39:51+05:30 IST