Nara Lokesh: మీ రక్షణ, శ్రేయస్సు నా బాధ్యత.. సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-08-30T10:28:10+05:30 IST

రక్షా బంధన్‌ సందర్భంగా రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు టీడీపీ యువనేత నారా లోకేశ్ శుభాకాంక్షల తెలియజేశారు.

Nara Lokesh: మీ రక్షణ, శ్రేయస్సు నా బాధ్యత.. సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు

ఏలూరు: రక్షా బంధన్‌ (Raksha Bandhan) సందర్భంగా రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) శుభాకాంక్షల తెలియజేశారు. సొంత అక్కాచెల్లెళ్లు లేని తనకు ల‌క్ష‌లాది మంది తోబుట్టువుల‌ను దేవుడిచ్చాడని అన్నారు. ‘‘యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌తీ ఊరిలోనూ నా అక్కాచెల్లెళ్లు రాఖీలు క‌ట్టారు. అవ్వ‌, అమ్మ‌లంతా చ‌ల్ల‌గా ఉండాల‌ని ఆశీస్సులు అందించారు. నా ఆయురారోగ్యాల కోసం మ‌హిళ‌లంతా హార‌తుల‌తో నీరాజ‌నాలు ప‌ట్టారు. మీ అంద‌రి ప్రేమాభిమాన ఆప్యాయ‌త‌లు పొందుతున్న నేను ఎంతో అదృష్ట‌వంతుడిని. ఆడ‌ప‌డుచుల‌కి అన్న ఎన్టీఆర్ ఆస్తిహ‌క్కు క‌ల్పించారు. మ‌హిళ‌ల‌ను మ‌హాశ‌క్తిగా తీర్చిదిద్దారు చంద్ర‌న్న‌. తెలుగుదేశం మార్గ‌ద‌ర్శ‌కుల‌ బాట‌లోనే మీ ర‌క్ష‌ణ, శ్రేయ‌స్సు కోసం కృషి చేయ‌డం నా బాధ్య‌త‌. సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండ‌గ శుభాకాంక్ష‌లు’’ అని లోకేశ్ తెలిపారు.

Updated Date - 2023-08-30T10:28:10+05:30 IST