Yuvagalam Nara Lokesh: ఆగస్టు 1న పల్నాడు జిల్లాలోకి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

ABN , First Publish Date - 2023-07-30T15:39:18+05:30 IST

టీడీపీ (TDP) జాతీయ ప్రాధాన్య కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) అప్రతిహాసంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్ర ఆగస్టు 1న పల్నాడు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. జిల్లాలో వినుకొండ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవనుంది.

Yuvagalam Nara Lokesh: ఆగస్టు 1న పల్నాడు జిల్లాలోకి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

పల్నాడు: టీడీపీ (TDP) జాతీయ ప్రాధాన్య కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) అప్రతిహాసంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్ర ఆగస్టు 1న పల్నాడు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. జిల్లాలో వినుకొండ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవనుంది. ఈ సందర్భంగా యువనేత లోకేష్‌కు స్వాగతం పలికేందుకు ముప్పరాజువారిపాలెంలో టీడీపీ శ్రేణుల భారీగా స్వాగత ఏర్పాట్లు సిద్ధం చేశాయి. స్వాగత ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. జీవీ ఆంజనేయులు, పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, శ్రీధర్‌‌తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: బండారు మాధవ నాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా, గుండాల్లా వ్యవహిస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు విమర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అండ చూసుకుని అధికారులు న్యాయ వ్యవస్థను కూడా గౌరవించకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ అర్ధరాత్రి పూట దుకాణాలను ధ్వంసం చేశారని అన్నారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు, చిరు వ్యాపారులపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమని ఖండించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-07-30T17:10:38+05:30 IST