AP News: భారత్‌లోనే తొలిసారి వైద్యుల జాతీయ క్రీడా ఉత్సవాలు.. రేపటి నుంచి మొదలు
ABN , First Publish Date - 2023-11-21T11:14:46+05:30 IST
భారతదేశంలోనే తొలిసారిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యుల జాతీయ క్రీడా ఉత్సవాలు జరుగనున్నాయి.
విజయవాడ: భారతదేశంలోనే తొలిసారిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) ఆధ్వర్యంలో వైద్యుల జాతీయ క్రీడా ఉత్సవాలు (Doctors National Sports Festivals) జరుగనున్నాయి. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ తుమ్మల కార్తీక్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 18 రాష్ట్రాల నుంచి డాక్టర్స్ ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వెయ్యి మందికి పైగా డాక్టర్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారని చెప్పారు. 21 క్రీడా పోటీలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహిస్తోందన్నారు. క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన డాక్టర్లకు ఐదు లక్షల రూపాయల ప్రైజ్‌మనీ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. మిగిలిన పోటీ విజేతలకు పథకాలు ట్రోఫీలు ఇస్తున్నామన్నారు.
నిత్యం ఒత్తిడికి గురవుతున్న వైద్యులకు ఊరట కోసం, క్రీడల పట్ల ఆసక్తి కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ క్రీడా పోటీలు వివిధ గ్రౌండ్స్‌లో జరగనున్నాయన్నారు. ప్రధాన క్రీడా కేంద్రము ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని తెలిపారు. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రౌండ్స్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ తుమ్మల కార్తీక్ పేర్కొన్నారు.