Kodali Nani: కొడాలి నానిపై ఎన్‌బీడబ్ల్యూ
ABN , First Publish Date - 2023-03-02T21:01:58+05:30 IST
మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)పై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో జాప్యంపై ఇన్‌స్పెక్టర్ కోర్టుకు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)పై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో జాప్యంపై ఇన్‌స్పెక్టర్ కోర్టుకు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకహోదా (special status) కోసం వైసీపీ చేపట్టిన కార్యక్రమాల్లో నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ నాని వాటిని ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. రహదారులపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. ఈ ఘటనలకు సంబంధించి గవర్నరుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణకు నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేసింది. ఈ ఎన్‌బీడబ్ల్యూలు కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వాయిదాలకు కొడాలి నాని హాజరుకాకపోవడంతో విజయవాడ (Vijayawada)లోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై గవర్నరుపేట ఇన్‌స్పెక్టర్ సురేష్ కోర్టుకు గురువారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.