ACB: నెల్లూరు కోవూరు సబ్ రిజిస్ట్రేట్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ABN , First Publish Date - 2023-09-01T19:58:13+05:30 IST

కోవూరులోని సబ్ రిజిస్ట్రేట్ కార్యాలయంపై (Sub-Registrar) అధికారులు ఏసీబీ (ACB) దాడులు చేశారు.

ACB: నెల్లూరు కోవూరు సబ్ రిజిస్ట్రేట్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

నెల్లూరు: కోవూరులోని సబ్ రిజిస్ట్రేట్ కార్యాలయంపై (Sub-Registrar) అధికారులు ఏసీబీ (ACB) దాడులు చేశారు. సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు బోధనపు రాజ్ కుమార్ రెండు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలని అడగడంతో పంచాయతీ అప్రూవల్ లేదని, రూ.30 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బోధనపు రాజ్ కుమార్ ఏసీబీని ఆశ్రయించారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐలు, శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-01T20:00:52+05:30 IST