AP News: ఎమ్మెల్యే మెప్పు కోసం పరీక్షలనే వాయిదా వేశారు.. కావాలిలో అధికారుల తీరిది..

ABN , First Publish Date - 2023-10-07T16:02:36+05:30 IST

కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డిపై అధికారులకు స్వామిభక్తి రోజు రోజుకు పెరుగుతోంది.

AP News: ఎమ్మెల్యే మెప్పు కోసం పరీక్షలనే వాయిదా వేశారు.. కావాలిలో అధికారుల తీరిది..

నెల్లూరు: కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డిపై అధికారులకు స్వామిభక్తి రోజు రోజుకు పెరుగుతోంది. వెంగళరావునగర్ శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో జగనన్న సురక్ష కార్యక్రమం కోసం అధికారులు పరీక్షలు వాయిదా వేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెప్పు కోసం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం జరగవలసిన ఆంగ్లం, గణితం పరీక్షలను ప్రధాన ఉపాధ్యాయుడు వాయిదా వేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, ఆర్డీవో శీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ కిరణ్ పాల్గొన్నారు. పరీక్షల విషయంలో అధికారుల తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-07T16:02:36+05:30 IST