Nellore Dist.: రసవత్తరంగా మారిన ఉదయగిరి రాజకీయం
ABN , First Publish Date - 2023-05-09T17:03:29+05:30 IST
నెల్లూరు జిల్లా (Nellore Dist.): ఉదయగిరి రాజకీయం (Udayagiri Politics) మరోసారి రసవత్తరంగా మారింది.
నెల్లూరు జిల్లా (Nellore Dist.): ఉదయగిరి రాజకీయం (Udayagiri Politics) మరోసారి రసవత్తరంగా మారింది. దుత్తలూరు (Duttaluru)లో చిరకాల రాజకీయ శత్రువులు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి (Ex MLA Kambam Vijayarami Reddy), ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (MLA Mekapati Chandrasekhar Reddy) భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగించారు. మేకపాటి టీడీపీ (TDP)లోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ (Line Clear) చేసుకుంటున్నారనే చర్చలు సాగాయి. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని మేకపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.