Pattabhi: పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

ABN , First Publish Date - 2023-02-23T21:09:50+05:30 IST

గన్నవరం (Gannavaram)లో జరిగిన ఘటనల్లో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభి (Pattabhi)తో పాటు పది మందికి బెయిల్‌ (Bail) మంజూరు చేయాలని విజయవాడ..

Pattabhi: పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

విజయవాడ: గన్నవరం (Gannavaram)లో జరిగిన ఘటనల్లో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభి (Pattabhi)తో పాటు పది మందికి బెయిల్‌ (Bail) మంజూరు చేయాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పట్టాభితోపాటు నిందితులంతా రాజమండ్రి (Rajahmundry) కేంద్ర కారాగారంలో ఉన్నారు. వారిని విడుదల చేయాలని టీడీపీ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉన్నది. సీఐ కనకారావుతోపాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితోసహా పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోసహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 341, 333, 307 కింద కేసులు నమోదు చేశారు.

పట్టాభితోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదు చేసిన మూడు కేసుల్లో 13 మందిని పోలీసులు నిందితులుగా చూపించారు. వారిలో పట్టాభితోపాటు పది మందిని గన్నవరంలోని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసి తనను కొట్టారని పట్టాభి చెప్పడంతో న్యాయమూర్తి శిరీష వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మిగతా పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు రిమాండ్‌ విధించారు.

Updated Date - 2023-02-23T21:09:51+05:30 IST