Pawan Kalyan: నేటి నుంచి 4వ విడత వారాహి విజయయాత్ర.. అవనిగడ్డలో ఇదీ పరిస్థితి..

ABN , First Publish Date - 2023-10-01T12:47:13+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (నేడు) నుంచి 4వ విడత వారాహి విజయ యాత్ర (Varahi Yatra) చేపడతారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ప్రారంభమవనుంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో 5 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం 3 గంటలకు భారీ బహరంగసభ జరగనుంది.

Pawan Kalyan: నేటి నుంచి 4వ విడత వారాహి విజయయాత్ర.. అవనిగడ్డలో ఇదీ పరిస్థితి..

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (నేడు) నుంచి 4వ విడత వారాహి విజయ యాత్ర (Varahi Yatra) చేపడతారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ప్రారంభమవనుంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో 5 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం 3 గంటలకు భారీ బహరంగసభ జరగనుంది. కాగా జనసేన, తెలుగుదేశం కలిసే ఎన్నికలకు వెళ్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన అనంతరం నిర్వహిస్తున్న వారాహి యాత్ర కావడంతో ఈ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వారాహి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం నేతలకు, కార్యకర్తలకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. దీంతో వారాహి యాత్రకు విచ్చేయుచున్న పవన్ కల్యాణ్‌కు స్వాగతమంటూ ఫ్లెక్సీలు, కటౌట్‌లు, జెండాలతో అవనిగడ్డ నిండిపోయింది.


మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్

వారాహియాత్ర దృష్ట్యా పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయమే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు అవనిగడ్డ సభకు ఆయన బయలుదేరనున్నారు. సాయంత్రం నుంచి ఐదు రోజుల పాటు కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర జరగనుంది. ఇదిలావుండగా యాత్ర దృష్ట్యా వారాహి వాహనం ఇప్పటికే అవనిగడ్డ చేరుకుంది. వారాహి వాహనం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ జనసైనికులు సందడి చేస్తున్నారు. యాత్రలో జనసేన కార్యకర్తలకుపాటు తెలుగుదేశం శ్రేణులు కూడా కనిపించనున్నాయి. ఈ మేరకు నియోజకవర్గంలో ఏ వీధి చూసినా టీడీపీ జనసేన బ్యానర్లు ఏర్పాటు చేసి జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు.

Updated Date - 2023-10-01T12:47:42+05:30 IST