Share News

Pawan Kalyan vs YCP: రేపు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన.. వైసీపీ నేతల బెదిరింపు

ABN , First Publish Date - 2023-11-23T22:04:48+05:30 IST

రేపు విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఫిషింగ్స్ హార్బర్‌లో అగ్నిప్రమాద బాధితులకు పవన్ కల్యాణ్ ఒక్కొక్కరికి రూ. 50 వేల ఆర్ధిక సహాయం చేయనున్నారు.

Pawan Kalyan vs YCP: రేపు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన.. వైసీపీ నేతల బెదిరింపు

విశాఖపట్నం: రేపు విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఫిషింగ్స్ హార్బర్‌లో అగ్నిప్రమాద బాధితులకు పవన్ కల్యాణ్ ఒక్కొక్కరికి రూ. 50 వేల ఆర్ధిక సహాయం చేయనున్నారు. పవన్ ఆర్ధిక సహాయాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆర్ధిక సహాయాన్ని తీసుకోవద్దని బాధితులకు హెచ్చరికలు జారీ చేశారు.

వాలంటీలర్ల ద్వారా బాధితులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. పవన్ ఆర్ధిక సహాయం తీసుకుంటే...ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. వైసీపీ తీరుపై జనసేన పీఏసీ సభ్యుడు కోనా తాతారావు, సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అడ్డుంకులు సృష్టిస్తే...బాధితుల ఇంటికి వెళ్లి మరీ పవన్ ఆర్ధిక సహాయం చేస్తారని కోన తాతారావు, పంచకర్ల రమేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-23T22:11:07+05:30 IST