Pawan Kalyan: బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసిన పవన్

ABN , First Publish Date - 2023-03-11T20:22:21+05:30 IST

బీసీలకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. రాజ్యాధికారం అర్థించడం కాదని, సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే..

Pawan Kalyan: బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసిన పవన్

అమరావతి: బీసీలకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. రాజ్యాధికారం అర్థించడం కాదని, సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. ఎప్పటికీ దేహీ అనాల్సి వస్తుందన్నారు. తాను ఒక కులానికి మాత్రమే ప్రతినిధిని కాదని, ప్రజలందరికీ ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నానని ప్రకటించారు. తెలంగాణ (Telangana)లో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, బీసీ కులాల తొలగింపుపై బీఆర్‌ఎస్ (BRS) వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.

‘‘బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్. బీసీల్లో అనైక్యత వల్లే ఇతరులు బలంగా ఉంటున్నారు. బీసీలకు రాజకీయ సాధికారితే కాదు.. ఆర్ధిక పరిపుష్టి కావాలి. బీసీల సదస్సుకు వస్తారు.. కానీ, బీసీలకు ఎందుకు ఓటు వేయరు?.. కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పెరిగితే తూర్పుకాపులంతా పెరిగినట్లు కాదు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బీసీలకూ ఉపప్రణాళికా నిధులు ఉండాలి. బీసీలను జగన్ ప్రభుత్వం మోసం చేసింది’’ అని పవన్కల్యాణ్ మండిపడ్డారు.

Updated Date - 2023-03-11T20:22:34+05:30 IST