AP News: ప్రకాశం జిల్లాలో దళిత కుటుంబంపై దాడి.. నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2023-08-15T14:50:07+05:30 IST

దర్శి మండలం బొట్లపాలెంలో దారుణం జరిగింది. దళిత కుటుంబంపై బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ దాడికి తెగబడ్డారు. తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి తల్లి, సోదరిపై దాడికి పాల్పడ్డారు. యువకుడి సోదరి బట్టలు చింపి పెట్రోల్ పోసి

AP News: ప్రకాశం జిల్లాలో దళిత కుటుంబంపై దాడి.. నిందితుల అరెస్ట్

ప్రకాశం: దర్శి మండలం బొట్లపాలెంలో దారుణం జరిగింది. దళిత కుటుంబంపై బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ దాడికి తెగబడ్డారు. తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి తల్లి, సోదరిపై దాడికి పాల్పడ్డారు. యువకుడి సోదరి బట్టలు చింపి పెట్రోల్ పోసి ఘాతుకానికి పూనుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో యువకుడి తల్లి అనురాధ, సోదరి మౌనిక చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఘటనాస్థలిలో నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-08-15T14:50:07+05:30 IST